ఐ డిడ్ ఏ పెర్ఫార్మన్స్ ….

“దొంగోడు దొరబాబు” అని ఒక మంచి కళాఖండ పాత్రను ఆ రోజుల్లో పోషించానులెండి!

అప్పట్లో నేను స్కూల్లో రోజూ చేసే నటనను గుర్తుంచి బహుశా నాకు ఆ పాత్ర ఇచ్చారేమో అని ఇప్పుడు ఆలోచిస్తుంటే తెలుస్తుంది. మన నటనా ప్రావీణ్యత అలాంటిది మరి!

ఓహో అంతగా ఏమి నటించావ్ అని మీరు అనుకుంటున్నారా ….

అయితే ఈ సంఘటనలు మీకు చెప్పాల్సిందే,

1 . అప్పట్లో స్కూల్ ఎగ్గొట్టటానికి నేను చేసే పెర్ఫార్మన్స్ అంతా ఇంతా కాదు. సాయంత్రం అంతా ఆడుకోవడం, మరుసటిరోజు ఉదయాన్నే లేచి తెగ దగ్గు దగ్గడం! బాగా దగ్గుగా ఉంది, నేను స్కూల్ కి వెళ్లనని చెప్పడం. నా నటనకు మెచ్చి మా ఇంట్లో వాళ్ళు నేను దగ్గే దగ్గుకి ఒక పేరు కూడా పెట్టారు, దాని పేరు “కాన్వెంట్ దగ్గు” అనమాట.

2 . మా లెక్కల మాస్టారు ఏదన్నా ప్రశ్న అడిగితే, నాకు సమాధానం తెలుసు కానీ ఇప్పుడే మర్చిపోయా అన్నట్టు నేను చేసిన నటన అంతా ఇంత కాదు అండి! అ నటనా ప్రాసిస్త్యం కు నాకు భాస్కర్ అవార్డు కూడా వచ్చేదేమో!

ఇక స్టేజి పెర్ఫార్మన్స్ కి వస్తే, దొంగోడు దొరబాబు పాత్ర అర్ధరాత్రి ఒక చిన్న ఊర్లో దొంగతనం చేసుకునే పాత్ర! బహుశా చదువు లో నా గొప్పతనాన్ని గమనించి భవిషత్తులో వీడు కనీసం దొంగగా అయినా బ్రతుకుతాడేమో అని మా స్కూల్ వారు ఇచ్చి ఉండొచ్చు! నాకు బాగా గుర్తు, నా పాత్ర హైలైట్ అవ్వడానికి కింద ఉన్న ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్లి మరి డబ్బులివ్వమని బెదిరించాను. దీన్నే “దొంగ ఎలివేషన్” అంటారు లెండి మీకు తెలియదు!

ఇక పోతే, రోడ్డు మీద అమ్మాయికి బీట్ వేసి తనను పడగొట్టే హీరో, తరువాత అ హీరో దేవదాసు అయ్యే పాత్రలో జీవించేసాను అనుకోండి! మనకు అ హీరో టాలెంట్ అ డ్రామా తరువాతే నిజజీవితంలో కూడా మొదలయ్యింది లెండి! (ఆ కోటు వేసుకున్న దొరబాబు నేనే, నా పక్కనే ఉంది హీరోయిన్ — నా ఫ్రెండ్ మోతిలాల్ గాడు అమ్మాయి వేషంలో).

ఇలా ఇంకా ఎన్నో పాత్రలు వేసి వేసి, ఇప్పుడు కొన్ని సార్లు నిజ జీవితంలో కూడా పెర్ఫార్మన్స్ చేస్తున్నాను. ఒకవేళ రియాలిటీ షోలు లాగా నిజ జీవిత యాక్టింగ్ షోలకు అవార్డులు ఇస్తే, ఆ అయ్యప్ప స్వామి సాక్షిగా చెపుతున్న, “ఆస్కార్ అవార్డు తో పాటు భాస్కర్ అవార్డు కూడా నాదే”

ఇట్లు,

సరదాగా,

ప్రవీణ్!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x