ఎల్నినో అంటే ఏమిటి? అది భారతదేశ వాతావరణంపై చూపే ప్రభావము ఏమిటి?

ఈ చిత్రాన్ని మన మనసులో ఉంచుకుని ఈ సమాధానాన్ని క్షున్నంగా పరిశీలిదాం ….


కొన్ని ప్రత్యేకమైన సంవత్సరాలలో పసిఫిక్ మహాసముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థితి కంటె బిన్నంగా పరిణామం చెందుతాయి. ఈ ప్రక్రియలో సముద్రపు ఉపరితలం మీద జరిగే మార్పులను ఎల్నినో ఆసిలేషన్స్ (ENSO Oscillations), లేదా సథరన్ ఆసిలేషన్స్ (Southern Oscillations) అని వాతావరణ శాస్త్రవేత్తలు సంబోధిస్తారు.

పసిఫిక్ సముద్రపు సాధారణ వాతావరణ పరిస్థితి:

ఈ ఎల్నినోని మనం అర్ధం చేసుకోవాలంటే ముందుగా మనం పసిఫిక్ సముద్ర ఉపరితల సాధారణ వాతావరణ పరిస్థితిని అర్ధం చేసుకోవాలి. ఇందుకు మనం కిందనున్న చిత్రం యొక్క సహాయం తీసుకుందాం. ఈ చిత్రం పసిఫిక్ మహాసముద్రం యొక్క సాధారణ వాతావరణ స్థితిని (Neutral Conditions) మనకు తెలుపుతుంది. సాధారణంగా ఇండోనేషియా— ఆస్ట్రేలియా దేశాల దగ్గర పసిఫిక్ సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు వేడిగాను (చిత్రంలో ఎరుపు రంగు వేడిని సూచిస్తుంది), దక్షిణ అమెరికా—ఉత్తర అమెరికా దేశాల దగ్గర సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు చల్లగా (బులుగు రంగు చల్లదనాన్ని సూచిస్తుంది) ఉంటాయి. ఆ పరిస్థితినే మనం ఈ కింద చిత్రం ద్వారా చూడవచ్చు.

ఎల్నినో (El Nino) పసిఫిక్ సముద్రపు వాతావరణ స్థితిని ఎలా మారుస్తుంది?

కొన్ని సంవత్సరములలో సాధారణ పసిఫిక్ సముద్రపు వాతావరణ స్థితికి బిన్నంగా, ఇండోనేషియా—ఆస్ట్రేలియా దేశాల దగ్గర పసిఫిక్ సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు చల్లగాను, దక్షిణ అమెరికా—ఉత్తర అమెరికా దేశాల దగ్గర సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు వేడిగాను మార్పు చెందుతాయి. ఇలాంటి పరిస్థితిని వాతావరణ నిపుణులు ఎల్నినో స్థితిగా పిలుస్తారు. ఎల్నినో పరిస్థితి సముద్రంలో తీసుకువచ్చే ఉష్ణోగ్రత మార్పులను మీరు ఈ కింద చిత్రంలో చూడవచ్చు.

పసిఫిక్ సముద్రంలో జరిగే వాతావరణ మార్పు భారత దేశం మీద ప్రభావం ఎలా చూపుతుంది?

ఈ ప్రశ్నకు సామాధానం కోసం ఒక్కసారి మనం చరిత్రను పరిశీలిదాం. భారత దేశం బ్రిటిష్ వారి పరిపాలనలో ఉన్నపుడు, 1864 కలకత్తా పరిసర ప్రాంతాలలో ఒక పెను తుఫాను సుమారు 70,000 మంది ప్రాణాలను తీసింది. తుఫాను కారణంగా జరిగిన విధ్వంసాలను దృష్టిలో ఉంచుకుని, బ్రిటిష్ ప్రభుత్వం కచ్చితమైన వాతావరణ అంచనాలకు, భారత వాతావరణ శాఖను 1875 లో స్థాపించి, Sir Henrry Francis Blanford[1] ను మొట్టమొదట డైరెక్టర్ గా నియమించింది. భారతదేశ ఆర్థిక స్థితిగతులు మన వ్యవసాయ రంగం మీద ఎలా ఆదారపడి ఉందొ మనకు ఇప్పటికీ విదితమే!

ఆ రోజుల్లో నైరుతి రుతుపవనాల ద్వారా కురిసిన వర్షపాతం మన దేశ వ్యవసాయానికి ఎంత ముఖ్యమో గమనించిన Sir Henry Francis Blanford , భారత దేశ రుతుపవనాలని మరియు వర్షపాతాన్ని ముందుగానే అంచనావేయడానికి ప్రపంచ వాతావరణ స్థితిగతులను అర్ధం చేసుకోవడం ప్రారంభించాడు. చాలా సంవత్సరాల వరకు మన దేశ వాతావరణ అంచనా తలకిందులు కావడంతో, ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వంపై తీవ్ర వత్తిడి నెలకొంది.

ఇలాంటి పరిస్థుతుల్లో 1904 వ సంవత్సరంలో Sir Gilbert Thomas Walker[2] భారత వాతావరణ శాఖలో చేరారు. ప్రపంచంలో మొట్టమొదటి సారిగా, పసిఫిక్ మహాసముద్రపు ఉపరితలంలో జరుగుతున్న మార్పులు, భారత నైరుతీ రుతుపవనాలలో జరిగే మార్పులకు సంబంధం ఉందని లెక్కల ద్వారా అంచనా వేసాడు[3]. అంటే ఎల్నినో భారత దేశం మీద చూపే ప్రభావాన్ని మనకు Sir Gilbert Thomas Walker కనుగొన్నారు[4]. ఎన్నో పరిశోధనల తరువాత శాస్త్రవేత్తలు అంచనా వేసిందేంటంటే,

  • పసిఫిక్ మహాసముద్రంలో ఒకవేళ ఎల్నినో ఏర్పడితే, నైరుతీ రుతుపవనాల బలహీనపడి, భారత దేశం అంతటా తక్కువ మోతాదులో వర్షపాతం నమోదవుతుంది. దీని కారణంగా మన దేశంలో వ్యవసాయం పూర్తిగా దెబ్బతిని కరువులు సంభవించే ప్రమాదం ఉంది (మొట్టమొదటి చిత్రమే ఈ వాక్యానికి నిదర్శనం).
  • ఒకవేళ ఎల్నినో పరిస్థితులు సాధారణంగా ఉంటె మన దేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుంది. ఎల్నినోకి బినంగా మరో పరిస్థితి (లానిన్న) ఉంటె అధిక వర్షపాతం నమోదవుతుంది.

ఎల్నినో మన దేశంనే కాకా ప్రపంచంలో చాల దేశాలలో వాతావరణ మార్పుకు కారణమవుతుంది. ఉదాహరణకు ఆస్ట్రేలియా, అమెరికా, యూరోప్లో కూడా వాతావరణం ప్రభావం చెందుతుంది.

అయితే వాతావరణ మార్పు కారణంగా ఈ మధ్యకాలంలో, ఎల్నినో భారతదేశ నైరుతీ ఋతుపవనాల మీద చూపే ప్రభావం తగ్గుతుందని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు[5]. దీనికోసం మరింత పరిశోధన మన దేశానికీ చాలా అవసరం.

స్వస్తి

ప్రవీణ్ కుమార్.

*************************************************************************

Sir Gilbert Thomas Walker రాసిన పరిశోధనాపత్రంలో నాకు నచ్చిన ఒక వాక్యం:

“The almost universal idea that weather must repeat itself after a certain number of years finds its origin, I imagine, ultimately in the ancient belief in the control of our affairs by the heavenly bodies with their definite cycles-a belief which clearly shows itself in the supposed influence of the moon on the weather. Be that as it may, the faith in periods is so deep-seated that even in scientific discussions the ordinary tests for validity are very often ignored”


ఫుట్‌నోట్స్

[1] Henry Francis Blanford – Wikipedia

[2] Gilbert Walker (physicist) – Wikipedia

[3] https://www.nature.com/articles/132805a0.pdf

[4] Walker: Identifying the Southern Oscillation

[5] On the weakening relationship between the indian monsoon and ENSO – PubMed

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x