అంటార్కిటికా వాతావరణ పరిస్థితులు ..

మన దేశం అంటార్కిటికా వాతావరణ పరిస్థితుల మీద పరిశోధన జరపడానికి నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ రీసెర్చ్ సంస్థను గోవా నగరం లో స్థాపించింది. మన దేశంలోని శాస్త్రవేత్తలు అంటార్కిటికా లో మనం ఏర్పరుచుకున్న రెండు శాస్త్రీయ ప్రయోగశాలలు “భారతి” మారియు “మైత్రి” లకు వెళ్లి ప్రతీ సంవత్సరం పరిశోధనలు జరుపుతుంటారు. మీకు ఆసక్తి ఉంటె ఈ పేజీ ని చదవవచ్చు, (NATIONAL CENTRE FOR POLAR AND OCEAN RESEARCH).

అంటార్కిటికాలో అంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవ్వడానికి కొన్ని కారణాలు ఇక్కడ ప్రస్తావిస్తాను.

  1. సూర్యుడి యొక్క రేడియేషన్ (radiation) మన భూమధ్యరేఖతో పోలిస్తే ఉత్తర ద్రవం మీద దక్షణ ద్రవం మీద చాల తక్కువ మోతాదులో అందుబాటులో ఉంటుంది. దీనికి కారణం మన భూమి సుమారు 23.5 డిగ్రీలు వాలి ఉండడం వలన. దీని వలన సూర్యుని కిరణాలు నేరుగా ఉత్తర ధ్రువం మరియు దక్షణ ద్రవం మీద పడడానికి ఆస్కారం ఉండదు. ఇందువలన అంటార్టికా చాల చల్లగా ఉంటుంది.

చిత్ర మూలం: Sun – Earth Relationship: The Seasons

2. మంచు సూర్యుడి యొక్క రేడియేషన్ (radiation) ని తిరిగి అంతరిక్షం లోకి రిఫ్లెక్ట్ (reflect) చేస్తుంది (దీన్ని అల్బెడో (albedo) అఫక్ట్ అని అంటాం). అది మంచు యొక్క సహజ లక్షణం. అంటార్కిటికాలో మంచు ఎక్కువగా ఉండడం వలన, ఉన్న కొద్ది సూర్యుడి యొక్క రేడియేషన్ తిరిగి అంతరిక్షం లోకి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇది అంటార్కిటికా చాల చల్లగా ఉండడానికి తోడ్పడుతుంది.

చిత్ర మూలం: Albedo and more

3. అంటార్కిటికాలో మేఘాలు చాల తక్కువగా ఉంటాయి. సాధారణంగా మేఘాలు ఉండడం వలన రాత్రి కొంత భూమి ఉపరితలం లో ఉన్న వేడిని తిరిగి అంతరిక్షంలోకి వెళ్లకుండా తోడ్పడతాయి (long wave energy storage). అంటార్కిటికాలో ఎక్కువ మేఘాలు లేనందువలన వాతావరణం చల్లగా ఉంటుంది.

చిత్ర మూలం: The Earth-Atmosphere Energy Balance

4. అంటార్కిటికా ఎత్తు సుమారు సముద్ర మట్టం కంటే 2500 మీటర్ల. సాధారణంగా సగటు సముద్ర మట్టం నుండి ఎత్తు పెరుగుతున్నపుడు వాతావరణం చల్లగా ఉంటుంది (కొండలు బాగా ఎత్తుగా ఉండడం వలన చల్లగా ఉంటాయి). అంటార్కిటికా ఎత్తుగా ఉండడం వలన చల్లగా ఉంటుంది.

చిత్ర మూలం: Where does Earth get its heat? – Martian Chronicles

5. చివరిగా సముద్రం భూమధ్యరేఖ లో ఉన్న వేడిని ఉత్తర మరియు దక్షణ ద్రవాలకు రవాణా చేస్తుంది (transport of heat through ocean currents: Conveyor Belt). కానీ కొన్ని సైంటిఫిక్ కారణాల వలన ఉత్తర ద్రవం తో పోలిస్తే దక్షణ ద్రవం లో ఉన్న అంటార్కిటికాకు సముద్రం తక్కువ వేడిని రవాణా చేస్తుంది. ఈ కారణం చేత కూడా అంటార్కిటికా చల్లగా ఉంటుంది.

చిత్ర మూలం:: Warm ocean currents are slowing down | EarthSky.org

ఇప్పటి వరకు అంటార్కిటికాలో అతి తక్కువగా నమోదు అయినా ఉష్ణోగ్రత -83 డిగ్రీలు, అతి ఎక్కువ -12 డిగ్రీలు.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x