మార్చ్ 8 , 2014. కౌలలంపూర్, మలేసియా నుండి బీజింగ్, చైనా కు MH370 నంబరు గల విమానం అర్దరాత్రి బయలుదేరింది. అందులో 227 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబంది ఉన్నారు. కౌలలంపూర్ నుండి బయలుదేరిన 38 నిముషాల తరువాత విమాన సిబంది నుండి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబందికి ఎలాంటి సమాచారం అందలేదు.
ఎలాంటి పరిస్థితుల్లోనైనా విమాన గమన మరియు లొకేషన్ కు సంబందించిన సమాచారాన్ని పంపే సాంకేతిక వ్యవస్థ (ట్రాన్స్‌పాండర్) ఇప్పటికి అంతుచిక్కని కారణం చేత ఆ రోజున పని చేయలేదు. కౌలలంపూర్ నుండి బయలుదేరిన 38 నిముషాలకు బంగాళాఖాతం, దక్షిణ చైనా సముద్రంలోకి కనుమరుగయింది MH370!
దక్షిణ చైనా సముద్రంలోనుండి కనుమరుగు అయిన తరువాత సైనిక రాడార్ మరియు ఉపగ్రహ వ్యవస్థ ద్వారా అందిన సిగ్నల్స్ ను బట్టి, శాస్త్రవేత్తలు MH370 దాదాపు 6 గంటలు సముద్రం మీద ప్రయాణించి దక్షిణ హిందూ మహాసముద్రంలో తన ప్రయాణాన్ని ముగించి ఉండొచ్చని అంచనా వేశారు .
విమానయానo చరిత్రలోనే ఒక అంతుచిక్కని మిస్టరీ ఈ MH370 విమాన అదృశ్యం. ఆస్ట్రేలియా, మలేసియా మరియు చైనా ప్రభుత్వాలు కలిసి MH370 విమానం కొరకు అక్టోబర్ 2014 న సముద్ర లోతుభాగంలో గాలింపు చర్యలు ప్రారంభించాయి. దాదాపు 120 ,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సముద్రాన్ని జల్లిడి వేశారు. దాదాపు మూడు సంవత్సరాల తరువాత ఆర్థిక భారం కారణంగా జనవరి 2017 న గాలింపు చర్యలు నిలిపివేశారు[1] .
ఇప్పటివరకు కొన్ని విమానపు శకలాలు దక్షిణ హిందూ మహాసముద్రంలో ఉన్న కొన్ని దీవులలో కనపడినా, MH370 మరియు దానిలోఉన్న ప్రయాణికుల జాడ అంతుచిక్కలేదు. మానవ చరిత్రలో ఇప్పటివరకు ఇదో అంతుచిక్కని ప్రశ్న —- “MH370 ఎక్కడ ఉంది?”
ఒకవేళ నేను గనుక సీసా ద్వారా మహాసముద్రంలో సందేశం పంపగలిగితే మాత్రం, దక్షిణ హిందూ మహాసంద్రం వైపు అ సీసా విసిరి MH370 ప్రయాణికులకు ఒక సందేశం పంపాలని ఉంది. “మీరు ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు?”
MH370 ప్రయాణం చేసిన మార్గం యొక్క అంచనా[3]
ఫుట్నోట్స్
[1] https://www.atsb.gov.au/media/5773565/operational-search-for-mh370_final_3oct2017.pdf
[2] Message in the bottle stock illustration. Illustration of post – 111077839
[3] https://www.atsb.gov.au/media/5773565/operational-search-for-mh370_final_3oct2017.pdf