నా జీవితంలో కూడా ఒకడు ఉన్నాడు. కానీ వాడిని భరించక తప్పదు!
ఈ ఫోటోలో ఉన్న పిలగాని పేరు “ప్రవీణ్ కుమార్”. ఎత్తు ఐదు అడుగుల పది అంగుళాలు. వయసు 21 సంవత్సరాలు. అందరికి అమాయకంగా కనపుడుతూ, అమాయకుడు కానీ వ్యక్తి అనమాట.
ఆ వయసులో పిలగాడు చాలా చురుకుగా ఉండేవాడు. పోదున్న లెగిస్తే క్రికెట్, అప్పుడపుడు కాలేజీ, సాయంత్రానికి క్యారమ్ బోర్డు.
చుట్టూ స్నేహితులు, ఆదివారం సముద్రపు ఒడ్డున విశ్రాంతి, సోమవారం కాలేజీలో భయబ్రాంతి.
ఊరిలో చిన్న చిన్న సెట్టిల్మెంట్లు, గోడలమీద ఎక్కి “ఐ లవ్ యు ఓ హారికా” అనే పాటలు పాడటాలు.
లోక్యం లేని తెగింపు, ఎవరికి సమస్య వచ్చినా ముందు వెళ్లి నేను ఉన్నాను అని చెప్పే దైర్యం! పండగలకు ఉత్సాహంతో ఊరిలో వేడుకల ఏర్పాట్లు!
మా ఉరి రైల్వే స్టేషన్ లో పంచాయితీలు, సాయంత్రం పినాకిని ఎక్సప్రెస్ వెళ్ళేదాకా స్నేహితులతో కబుర్లు! అర్ధరాత్రి టీ లు, అప్పుడపుడు పార్టీలు!
జీవితం అంటే లెక్కలేని తనం, కూసంత వెర్రితనం, కావాల్సినంత అజ్ఞానం, లెక్కలేనంత స్వేచ్ఛ!
****** పిలగాడు కొంత పెద్దయ్యాడు**********
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిపేరు “కాస్త పెద్దయిన ప్రవీణ్ కుమార్”. నల్ల కోటు వేసుకున్న పెద్ద, కాదు కాదు …., మధ్య వయసు మనిషి.
ఈయనగారికి పోదున్న లేస్తే ఆఫీస్, సాయంత్రం అయితే పాఠాలు (విద్యార్థులకు పాఠాలు చెప్పడం), కంప్యూటర్ తో ఆటు పోట్లు, వారాంతరానికి రెండు రిపోర్టులు. సమయం ఉంటె రెండు ఫిలాసఫీ పుస్తకాలు.
కొంత జీవితం మీద అలసట. ఒంటరితన్నాని ఇష్టపడడం, జీవితం మీద కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు.
కాస్త లౌక్యంతో జీవించడం, జీవన సాగరాన్ని అర్ధం చేసుకుంటూ ఈదుతుండడం.
కొంచెం బాధ్యతలను మోయడం, ఆచీతూచీ అడుగులు వేయడం.
కొంత స్వార్థం, ఇంకాస్త భయం, అప్పుడప్పుడు ఆవేశం! ఈయనలో ఈయనే తెగ ఆలోచించేసుకోడం.
William Shakespeare గారు అన్నట్టు “All the world’s a stage, and all the men and women merely players”,
ఈ ప్రపంచపు రంగస్థలం మీద సాధ్యమైనంతవరకు తన పాత్రలో తానూ కొంతమేరకు నటించడం.
జీవిత సారాంశం తెలియక మునుపు ప్రవీణ్ గా ఉన్నపుడు ఎంతో హాయిగా ఉండేది!
తెలిసింతరువాత ఈ “పెద్ద ప్రవీణ్” నాకు కాస్త బోర్ కొడుతున్నాడు, పెద్దగా నచ్చడం లేదు.
అందుకే ఇప్పుడు నేను ఈ పెద్ద ప్రవీణతో తూచ్! :p