రామ్ గోపాల్ వర్మ గారు మన ఇండియన్ సినిమాకి చేసిన/చేస్తున్న కాంట్రిబ్యూషన్ మెచ్చుకోవలసినదే! తాను ఎంచుకున్న వైవిధ్యమైయిన కధలు ప్రసంశనీయం (మాఫియా, ప్రేమ, సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ మొదలగునవి). కొన్ని కధలోని పాత్రలు వాస్తవికతకు దగ్గరగా వుంటాయి, ఉదాహరణకు రంగీలా, సత్య, వీరప్పన్ మొదలగునవి. తాను తీసిన కొన్ని సినిమాలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు.
రామ్ గోపాల్ వర్మ గారు చాలా మంది నూతన దర్శకులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసారు (కృష్ణ వంశీ, పూరి జగ్గన్నద్, అనురాగ్ కశ్యప్, మధుర్ భండార్కర్ ఇంకా చాల మంది వున్నారు). ఎంతో మంది నటులను కూడా పరిచయం చేసారు. పాత్రకు తగ్గ నటులను ఎంచుకోవడంలో ఈయన సిద్ధహస్తుడు. సినిమా లోని సాంకేతిక పరిజ్ఞానం వర్మ గారికి ఎక్కువని నా భావన. ఉదాహరణకు స్టడీ కెమెరా, ఫ్లో కెమెరాలను ముందుగా వాడడం, నూతన ప్రయోగాలు చేయడం ఈయనకే చెల్లింది. ఎప్పటికప్పుడు తనను తాను కాలానికి తగ్గట్టు నవీకరణ చేసుకోవడంలో సిద్ధహస్తుడు (ప్రస్తుత కరోనా సమయములో OTT Platform ఉపయోగించడం లాంటివి). సినిమా పరిశ్రమలో ముందు మాట వెనుక మాట లాంటివి లేకుండా సూటిగా, సుత్తిలేకుండా వున్న విషయం చెప్తారు.
వర్మ గారు రాసిన నా ఇష్టం పుస్తకంలో అయిన జీవితానుభవాలు, కొన్ని సంఘటనలు గురించి రాసారు. తాను రాసిన నా ఇష్టం పుస్తకం తనకే అకితం ఇచ్చుకున్న ఒక విలక్షణ వ్యక్తిత్వం కలవాడు. తను కొంతమంది తత్వవేత్తల పుస్తకాల ద్వారా స్ఫూర్తి పొందానని రాముయిజం అనే ఒక టీవీ షో లో చెప్పారు. ముక్యంగా Ayan Rand, Nietzsche , Arthur Schopenhauer మొదలుగు మరి కొంత మంది. ఈయన లోని నేను గమనించింది ఏమిటంటే , తనలా ఉండమని కానీ, తను చెప్పిందే వేదం అని కానీ ఎక్కడ చెప్పడు. తనకు అనిపించింది చెపుతారు, నచ్చితే వినమంటారు, లేకపోతే మీ కర్మ అంటారు. అయన ఎవరిని Judge చేయడం ఇంతవరకు నేను వినలేదు, కానీ ఆయనను మాత్రం Judge చేసిన వాళ్ళు కోకొల్లలు (వారికే వదిలేస్తున్న). ఒకవేళ అయన వల్లన సమాజమునకు హాని జరిగితే మన న్యాయవ్యవస్థ నుండి ఆయనకు శిక్ష పడాలని కోరుకుంటున్న. నేను ఆయనను వ్యక్తిగతంగా Judge చేయను.
“Judging a person does not define who they are. It defines who you are.” Wayne Dyer