మన చదువులు

మన చదువుల్లో నాణ్యత లేదు అనేది ఒక వాదన అయితే, మన దేశం “ఎక్సపోర్ట్ అఫ్ స్కిల్డ్ లేబర్ ” అని చెప్పుకునే వాదన మరొకటి. డిగ్రీలు పొంది మన ఊత్తు (యూత్) పెద్దగా ఇకింది ఏమిలేదు అని కొన్ని నివేదికల్లో చెప్తుంటే, భారతదేశం నుండి చదువుకున్న ఊత్తు ఈరోజు ప్రపంచాన్ని ముందుకు నడుపుతున్నారు అని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. రెండిటిలోను కొంత వాస్తవం ఉంది, రెండుటిలోను కొంత కల్పితం ఉంది.

ఇక నా అభిప్రాయం మూడో రకం!

ప్రపంచీకరణ వేగంగా జరుగుతుంది. ఈరోజుల్లో కావాల్సినంత సమచారం, వీడియో లెక్చర్స్, ట్యుటోరియల్స్, పుస్తకాలు మన అరచేతిలోనే ఉన్నాయి. టెక్నాలజీ పెరిగేకొలది అనేక సదుపాయలు ముందు ముందు మనకు అందుబాటులోకి వస్తాయి (అందరికి వస్తాయి అని నేను చెప్పలేను). విద్యావ్యవస్ధలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. ఉదాహరణకు కోవిడ్ సమయంలో ఆన్లైన్ వ్యవ్యస్థద్వారా విద్యావిధానం మనం ఇప్పటికే చూసాం. ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు ఆన్లైన్ తరగతులు అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉన్నాయి. కాబట్టి “మన విద్యావ్యవస్థ” పోయి “ప్రపంచ విద్యావ్యవస్థ” రాబోతుంది. మన ప్రభుత్వాలు డిజిటల్ టెక్నాలజీని సామాన్య ప్రజలకు అందుబాటులో తీసుకురాగలిగితే మనం మంచి మార్పును చూడవచ్చు.

ఇకపోతే ఈ ప్రశకు సమాధానం రాసె ప్రక్రియలో నా గురించి కొంత డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం దురదృష్టవశాత్తూ ఇప్పుడు నాకు పుష్కలంగా కనపడుతుంది, మన్నించగలరు.

మనం ఊత్తులో స్కూల్లో ఆడుకోవటం తప్ప పెద్దగా ఇకింది ఏమి లేదు. ఎక్కువశాతం ఉపాధ్యాయులు చెప్పింది అర్ధం అయ్యేవి కావు. ఇక ఇంటర్మీడియట్లో అయితే చేపను బండకేసి రుద్దినట్టు పిల్లల్ని రుద్దేవారు. కాలేజీకి వెళ్లడం పూర్తిగా మానేసాను. ఇంజనీరింగ్ కూడా దాదాపు తక్కువ అటెండెన్స్. కానీ చిన్నప్పటినుండి మా ఇంట్లో మా నాన్నగారితో మాత్రం నేను స్వయంగా పుస్తకాలు చదివి చర్చించేవాడిని. నాన్నగారు స్వయానా ప్రభుత్వ ప్రైమరీ టీచర్ కావడంతో , స్కూల్ లో సోషల్, సైన్స్ , లెక్కలు గురించి చర్చించుకునే వారం. అలా నాకు సెల్ఫ్ స్టడీ , క్రిటికల్ థింకింగ్, క్యూరియాసిటీ అలవాటు పడాయి. స్కూల్ మరియు ఇంటర్మీడియట్ లో నాకు మార్కులు ఎక్కువ రాలేదు , మా నాన్నగారు కూడా పెద్దగా మార్కులు గురించి పట్టించుకోలేదు. నేను జీవితం లో సక్సెస్ కాను అనే భయం ఆయనకు పూసంతకూడా లేదని నాకు భలంగా అనిపించేది! వాస్తవానికి ఆ భయం నాలో కూడ ఎప్పుడు లేదు.

కొంత పెద్ద అయ్యాక నా సెల్ఫ్ స్టడీ, క్రిటికల్ థింకింగ్, క్యూరియాసిటీ నాకు చాలా ఉపయోగ పడ్డాయి. ఆన్లైన్ లెక్చర్ వినడం, ఇంటర్నెట్ లో చదవడం మొదలైనవి నాకు చాలా ఉపయోగపడ్డాయి. నేను ఎపుడు మన విద్యావ్యవస్థలో లేను అని అనిపించేది, నా లోకంలో నేను ఉండేవాడిని అని అనిపించేది! నా స్నేహితులు నేను పరీక్షలు ఉన్నపుడు అందరికంటే తొందరగా పడుకునేవాడ్ని అని చెప్తారు. మనం పరీక్షకు పెద్దగా ప్రిపేర్ అయ్యింది కూడా లేదు. అయితే ఇంతకీ నేను ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యానా లేదా అన్నది నేను చెప్పలేను. నేను కరెక్ట్ అని కూడా చెప్పలేను. అది డిసైడ్ చేయాల్సింది పాఠకులు! నాకు ఇంజనీరింగ్ లో మెడల్ , IIT నుండి మెడల్ , పీహెడీ లో Magma cum lauda , ETH Zurich స్విట్జర్లాండ్లో సైంటిస్ట్ గా పని (మార్చ్ నుండి మొదలుపెడుతున్నాను, ఈ కళాశాలలోనే ఆల్బర్ట్ ఐన్స్స్టెయిన్ పనిచేసారు). ఇవి ఇక్కడ చెప్పడానికి ముఖ్య ఉద్దేశం నేను మన విద్యా-వ్యవస్థ అలవాటుకు కొంత బిన్నంగా నడుచుకున్నా… నా కెరీర్ లో కొంత మేరకు పర్వాలేదు అని అనుకుంటున్నాను! విద్యావిధానం ఎలా ఉన్నా సరే , పరిస్థితులు నాకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశాను.

మొత్తానికి నేను చెప్పదలచింది ఏంటంటే, విద్యార్థుల్లో సెల్ఫ్-స్టడీ, క్రిటికల్ థింకింగ్, క్యూరియాసిటీ అలవరుస్తే వారి కెరీర్ వారు చూసుకుంటారు. దురదృష్టవశాత్తు ఫియర్ అఫ్ ఫెయిల్యూర్ అనేది మన విద్యావ్యవస్థ పునాదిగా ఉంటుంది. మార్పు రావాల్సింది టీచర్స్ , ప్రొఫెస్సొర్స్ లోనే! విద్యార్థుల ఆలోచనలు ఎప్పుడు పాతతరం కంటే ఒక అడుగు ముందుంటాయి, వాటిని అందరం గౌరవించాలి! దీనికి మంచి ఉదాహరణ “ఇలాన్ మస్క్ ” 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x