నాకు బాగా నచ్చిన సబ్జెక్టు “క్రీడలు” — మా స్కూల్ లో అ పీరియడ్ ని “sports period “అని పిలిచేవారు.
మాకు శుక్రవారం రోజు స్పోర్ట్స్ పీరియడ్ మరియు డ్రిల్ల్ ఉండేది.
స్కూల్ కి ఏ రోజు వెళ్లినా, వెళ్లకపోయినా శుక్రవారం మాత్రం వెళ్ళేవాడిని.
మిగతా పీరియడ్లో బాగా నిద్రపోయేవాడిని, లేదా నిద్రవచ్చేది.
నాకు స్పోర్ట్స్ లో బాగా నచ్చేవి,
క్రికెట్, వాలీబాల్ , కో-కో , బాల్ బ్యాట్మింటన్, కబడ్డీ!
స్కూల్ లో మా PET మాస్టారు బేసిక్స్ బాగా నేర్పించారు. ముక్యంగా క్రికెట్, వాలీబాల్ నేను యూనివర్సిటీ వరకు ఆడాను.
మా మాస్టారు స్పోర్ట్స్ పీరియడ్లో స్పోర్ట్స్ ఎ కాదు, నాకు జీవిత పాఠాలు కూడా నేర్పారు అనిపిస్తుంది!
నేను క్రికెట్ బ్యాట్టింగ్ ఆడేటప్పుడు ఎప్పుడు వెయిట్ ఫర్ ది రైట్ టైం, సమయం నీకు అనుకూలంగా మారె దాక ఓర్పుతో ఆడు, తరువాత ఎటాక్ చెయ్ అని చెప్పారు.
జీవితంలో కూడా అదే పాటిస్తుంటాను. జీవితాన్ని కూడా చాలా ఓర్పుతో ముందుకు నడుపుతాను, బాగా కాంఫిడెన్స్ వచ్చాకే మంచి నిర్ణయాలు తీసుకుంటాను!
మా మాస్టారు ఎప్పుడు “ప్లే ఫ్రమ్ యువర్ హార్ట్” అని చెప్పేవారు.
ఇప్పటికి నేను ఏది చేసినా “ఐ డూ ఇట్ ఫ్రమ్ మై హార్ట్” , మనసుతోనే చేస్తాను!
Quora కూడా అంతే, నా సమాదానాలు అన్ని నా మనస్సులో నుండి వచ్చినవే ! ఇక ముందు కూడా అలానే వస్తాయి!
సో నాకు బాగా నచ్చిన సబ్జెక్టు “స్పోర్ట్స్“, నాకు కొంత జీవిత పాఠాలు కూడా నేర్పిన ఒక సబ్జెక్టు.
రెండు సంవత్సరాల క్రితం కస్టపడి ఒక ట్రోఫీ కూడా గెలిచాం క్రికెట్లో! 🙂
మా లెక్కల పంతులు కొన్ని సార్లు మీకు స్పోర్ట్స్ పీరియడ్ ఎందుకు, స్పెషల్ క్లాస్ తీసుకుంటాను అనేవారు. నేను అ రోజు నిరసనగా అ క్లాసుకి వెళ్ళేవాడిని కాదు. గ్రౌండ్లోకి వెళ్లి ఒక గంట నిరాహార దీక్ష చేసేవాడిని (:p ). నేను దొరికినప్పుడు తెగ కొట్టేవాడు, నేను మొండి గాడిని కనుక పెద్దగా పట్టించుకోను. మా ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ చేసేవాడిని , కానీ ఆవిడ కూడ నన్ను లెక్కలు చదవమని చెప్పేది. నాకు దీని ఎబ్బ (మా నాన్నకు ప్రేమతో, ఆవిడ నాన్నకు కాదు) జీవితం అనిపించేది!
ఇప్పుడు రిటైర్డ్ ప్లేయర్ కనుక గచ్చి బౌలి దివాకర్ లాగా ఇండియా ని దగ్గరుండి గెలిపిస్తున్నాను.