అప్పటి యూనివర్సిటీ విద్యావిధానంలో ఐన్ స్టీన్ ఒక ఫెయిల్యూర్!

ETH Zürich యూనివర్సిటీ, స్విట్జర్లాండ్ లో ఐన్ స్టీన్ ఇరవై సంవత్సరాల వయసు విద్యార్థిగా ఉన్నపుడు ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ తన ఆఫీసుకు రమ్మని ఐన్ స్టీన్ కు కబురు పెట్టాడు. ఏదో జరగబోతుంది అని ఐన్ స్టీన్ కు భయం వేసింది. కొంత సేపటి తరువాత ఆఫీసుకు వచ్చిన ఐన్ స్టీన్ తో “నువ్వు ఫిజిక్స్ కోర్స్ హాజరు కానందుకు, మరియు అందులో తక్కువ మార్కులు వచ్చినందుకు”నిన్ను ఫెయిల్ చేస్తున్నాను అని చెప్పాడు[1] .

దీనికి కారణం ఐన్ స్టీన్ కు ఆ యూనివర్సిటీ లో ఫిజిక్స్ ల్యాబ్ ఎక్సపెరిమెంట్స్ కానీ, ఫిజిక్స్ క్లాసులు కానీ సంతృప్తిని ఇవ్వనందుకు. థియరిటికల్ ఫిజిక్స్ తాను సొంతంగా చదువుకుంటాను అని నిర్ణయం తీసుకుని, ఎలాగో తన స్నేహితుడు గ్రాస్ మాన్ సహాయంతో కనిష్ట మార్కులతో డిగ్రీ పూర్తి చేసాడు.

డిగ్రీ తరువాత, తన స్నేహితుడు గ్రాస్ మాన్ నాన్నగారి సహాయంతో Switzerland బెర్న్ నగరం పేటెంట్ ఆఫీస్ లో చిన్న ఉద్యోగం చేసుకుంటూ, ఎనిమిది సంవత్సరాలలో థియరిటికల్ ఫిజిక్స్ కు సంబందించిన అద్భుతమైన సైన్స్ ను సైన్స్ పత్రికలలో ప్రచురించాడు. అనంతరం ETH జ్యూరిచ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు అక్కడ ప్రొఫెసర్ గా నియమించబడి, తన స్నేహితుడు గ్రాస్ మాన్ సహాయంతో సాపేక్షిక సిదాంతాన్ని కనుగొనే ప్రక్రియ ప్రారంభించాడు. తరువాత జర్మనీ బెర్లిన్ నగరంలో ప్రొఫెసర్ పదివికి అవకాశం రావడంతో, జర్మనీ వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నాడు. ETH జ్యూరిచ్ యూనివర్సిటీ ఎంత ప్రయత్నం చేసినా, ఐన్స్ స్టయిన్ ను జర్మనీ దేశానికి వెళ్లనివ్వకుండా ఆపలేకపోయాయి.

  • విశ్లేషణ:

అప్పటి యూనివర్సిటీ విద్యావిధానంలో ఐన్ స్టీన్ ఒక ఫెయిల్యూర్! కానీ అదే యూనివర్సిటీ సుమారు పది సంవత్సరాల తరువాత ఐన్ స్టీన్ ను తమ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా ఉండమని బ్రతిమిలాడింది. అయితే విద్యావిధానంలో ఇమడ లేక పోయిన ఐన్ స్టీన్, మానవ చెరిత్రలో గొప్ప ఆవిష్కరణలు ఎలా చేయగలిగాడు?

దానికి సమాధానం, ఐన్ స్టీన్ చిన్నప్పటి నుండి ఉన్న ఒక గొప్ప లక్షణం – “క్యూరియాసిటీ”. అంటే విశ్వ రహస్యాలను తెలుసుకోవాలన్న కుతూహలం. ఆ రహస్యాలకు సమాదానాలు వెతికే ప్రక్రియలో ఐన్ స్టీన్ ఎంచుకున్న విధానం “సైన్స్”. ఇంకా క్షుణంగా చెప్పాలంటే “మెథడ్ అఫ్ సైన్స్”. చిన్నప్పటినుండి మ్యాథ్స్ మరియు ఫిజిక్స్ లో ఆసక్తి కనపరిచిన ఐన్ స్టీన్ , పదహారో యాట ఒక సైన్స్ పత్రికను ప్రచురించ గలిగాడు.

  • స్విట్జర్లాండ్ విద్యావిధానం:

ఇక్కడ నివసించే పిల్లలందరికీ (ఇతర దేశం నుండి వచ్చిన వారితో సహా ) పదుకొండు సంవత్సరాల వరుకు తప్పనిసరి ఉచిత విద్య ప్రభుత్వ బాధ్యతే. ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసిన ఒక అంశం, విద్యలో నాణ్యత.

నాలుగు నుండి ఆరు సంవత్సరాల వరకు ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉంటుంది. ప్రైమరీ ఎడ్యుకేషన్ బడుల్లో పిల్లలమీద వత్తిడి దాదాపు ఉండదు. ఆట పాటలతో , ఆక్టివిటీస్ తో విద్యను అందిస్తారు. నేను చాలా సార్లు పిల్లల్ని వారి టీచర్స్ తో కొండలలో ఆడుకోడానికి వెళ్లడం చూసాను. చాలా ముద్దుగా ఉంటారు పిల్లలు, వారి ఆనందాన్ని చూడడం మరింత సంతోషాన్ని ఇస్తుంది.

తరువాత లోయర్ సెకండరీ ఎడ్యుకేషన్ (11 -12 వయసు వరకు) గవర్నమెంట్ లేదా ప్రైవేట్ స్కూల్లో పిల్లలు చదువుతారు. ఇక్కడ జర్మన్ , ఫ్రెంచ్ లేదా ఇటాలియన్ (ఇక్కడ నివసిస్తున్న రాష్ట్రాన్ని బట్టి) లో బోధనతో పాటు ఇంగ్లీష్ లో అనేక సబ్జక్ట్స్ బోధిస్తారు . ఇక్కడ పిల్లలు బట్టీ పట్టడాన్ని ప్రోత్సహించరు.

ఒక విద్యార్థి తమ సెకండరీ విద్యను పూర్తి చేసిన తరువాత – దాదాపు 15 సంవత్సరాల వయస్సులో – వారు తమ విద్యను కొనసాగించకూడదని నిర్ణయించుకోవచ్చు. కానీ అలాంటి సంఘటనలు దాదాపు తక్కువ.

హైయర్ ఎడ్యుకేషన్ ను స్థూలంగా రెండు విభాగాలుగా విభజించవచ్చు. ఒకటి ఒకేషనల్ ట్రైనింగ్ (VT) , రెండు అప్పర్ సెకండరీ స్కూల్. ఒకేషనల్ ట్రైనింగ్ (VT) లో భాగంగా పిల్లలు స్కూల్ ఎడ్యుకేషన్ తో అనుసంధానంగా ఒక కంపెనీ లో ట్రైనింగ్ తీసుకుని ఉద్యోగంలో చేరవచ్చు. ఉదాహరణకు ఎలక్ట్రికల్ పనిలో ట్రైనింగ్ తీసుకున్న తరువాత ఒక కంపెనీ లో ఉద్యోగం వెతుకోవొచ్చు. దాదాపు చాలా మంది పిల్లలు ఈ VT ట్రైనింగ్ తీసుకుని ఉద్యోగం లో చేరతారు. మిగిలిన విద్యార్థులు అప్పర్ సెకండరీ స్కూల్ లో చేరి సైన్స్ లేదా ఇతర స్పెషలైజేషన్ చదివి యూనివర్సిటీ విద్యకు అర్హత సాధిస్తారు. కానీ అప్పర్ స్కూల్ లో వెళ్లడం అంత సులువు అయిన పని కాదు.

  • ఇక నేను మొదట్లో ఐన్ స్టీన్ గురించి చెప్పిన కథ దేనికి?

దానికే వస్తున్నాను! నేను ఇప్పుడు పనిచేస్తున్న ETH యూనివర్సిటీ, అదే , నేను మొదట ఐన్ స్టీన్ చదివిన యూనివర్సిటీ గురించి ప్రస్తావించాను కదా. ఆ యూనివర్సిటీ లో నేను అర్ధం చేసుకున్న కొంత మంది పిల్లల గురించి చెప్పడానికి ఐన్ స్టీన్ కథ తో ప్రారంభించాను. ఇక్కడ పిల్లలు తాము ఎంచుకున్న విద్యా రంగంలో ఒక అంశ్యం పట్ల క్యూరియాసిటీ, లేదా ఆ అంస్యాన్ని తెలుసుకోవాలన్న తప్పన ఎక్కువగా కనపడుతుంది. సరిగ్గా ఐన్ స్టీన్ లో ఉన్న లక్షణం అనమాట. అంటే ఇక్కడ ప్రస్తుత విద్యా రంగం పిల్లలలోని క్యూరియాసిటీని పెంచి, ఆధునిక వసతులు కలిపించి , మెథడ్ అఫ్ సైన్స్ ద్వారా వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేవిందంగా రూపొందించారు. అలానే గతంలో జరిగిన విద్యావిధానంలో తప్పులను సరిదిద్ది నిరంతరం విద్యార్థులలో తపనను పెంచే విధానంగా మార్చుకుంటున్నారు.

బహుశా యువతకు కావాల్సింది ఇలాంటి విద్యావిధానమే ఏమో!

ధన్యవాదాలు,

కుమార్ సేనేక!

ఫుట్‌నోట్స్

  1. https://library.ethz.ch/en/locations-and-media/platforms/short-portraits/einstein-albert-1879-1955.html
  2. https://ethz.ch/content/dam/ethz/associates/services/News/life/ausgaben/englisch/eth_life_21_2_EN_web_PDF.pdf

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Anusha
Anusha
9 months ago

Good one, it’s the curiosity that makes the research go forward which ultimately leads to the invention of interesting facts. Its a great read and an eye opening that we shouldn’t get discouraged by the grades or professors comments, although positive criticism should be always welcomed.

1
0
Would love your thoughts, please comment.x
()
x